Revanth Reddy : రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ పెద్దలను కలవనున్నారు.;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ పెద్దలను కలవనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి ఏడాదిపూర్తి కావడంతో ఆయన ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ఏఐసీసీ పెద్దలను కలసి రాష్ట్ర రాజకీయాలపై చర్చించనున్నారు. ఏడాది నుంచి ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ జరగలేదన్న కారణంతో ఆయన ఢిల్లీ బయలుదేరి వెళుతున్నట్లు తెలిసింది.
ఏడాది కాలమయినా...
అదే సమయంలో ఏడాది అయినా ఇంకా ఆరు మంత్రి పదవులను భర్తీ చేయకపోవడంతో నేతలు అసంతృప్తిచెందుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికలు కూడా పూర్తి కావడంతో ఇక అధినాయకత్వం కూడా మంత్రి వర్గ విస్తరణకు లైన్ క్లియర్ చేసే అవకాశముంది. మంత్రి వర్గంలోకి ఎవరెవరని తీసుకోవాలన్న దానిపై పెద్దలతో చర్చించే ఛాన్స్ ఎక్కువగా కనపడుతుంది.