Revanth Reddy : నేడు ఎక్సైజ్ అధికారులతో రేవంత్ సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఎక్సైజ్ శాఖపై సమీక్ష చేయనున్నారు.;

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఎక్సైజ్ శాఖపై సమీక్ష చేయనున్నారు. ఉదయం పదకొండు గంటలకు బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎక్సైజ్ విభాగానికి చెందిన అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఎక్సైజ్ శాఖలో ప్రస్తుతం వస్తున్న ఆదాయంతో పాటు ఆదాయం పెంచుకునే మార్గాలపై చర్చించనున్నారు.
గంజాయి... నాటుసారాపై...
దీంతో పాటు ఎక్పైజ్ శాఖలో తీసుకు రావాల్సిన సంస్కరణలపై కూడా రేవంత్ రెడ్డి చర్చించే అవకాశాలున్నాయి. బెల్ట్ షాపులను అరికట్టడంతో పాటు మద్యం దుకాణాలలో అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచేందుకు అవసరమైన చర్యలపై ఆయన ప్రధానంగా ఎక్సైజ్ అధికారులతో చర్చించనున్నారు. దీంతో పాటు నాటుసారా తయారీ, గంజాయి వంటి వాటిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించనున్నారు.