Telangana : నేడు ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన ఇలా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొంగర్‌కలాన్ లో పర్యటించనున్నారు

Update: 2024-10-14 04:00 GMT

 Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొంగర్‌కలాన్ లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. కొంగర్ కలాన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఫాక్స్ కాన్ పనుల పురోగతి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరపనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

సమీక్ష అనంతరం...
కొంగర్‌కలాన్ లో రేవంత్ రెడ్డి పర్యటన నిమిత్తం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు అధికారులు కూడా పాల్గొననున్నారు. ఫాక్స్ కాన్ పనుల పురోగతిని సమీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
Tags:    

Similar News