Revanth Reddy : సొంతగడ్డపై సీఎం రేవంత్ దసరా వేడుకలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను పుట్టి పెరిగిన గ్రామంలో దసరా పండగ వేడుకల్లో పాల్గొన్నారు

Update: 2024-10-12 12:55 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను పుట్టి పెరిగిన గ్రామంలో దసరా పండగ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలో జన్మించారు. ముఖ్యమంత్రి కాకమునుపు కూడా ఆయన ఈ గ్రామంలో జరిగే దసరా వేడుకలకు హాజరయ్యే వారు. ఇప్పుడు తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో రావడంతో గ్రామ ప్రజలందరూ పండగ చేసుకుంటున్నారు. ఇదే తమకు అసలైన పండగ అని గ్రామస్థులు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో...
ఒక ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నేత తమ గ్రామంలో జన్మించడం తమ అదృష్టమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ ఈ గ్రామానికి వస్తారని తెలిసి వారంరోజుల ముందు నుంచే ఆ గ్రామంలో రోడ్లు అభివృద్ధి చేశారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హెలికాప్టర్ లో కొండారెడ్డిపల్లి గ్రామానికి చేరుకోవడంతో గ్రామ ప్రజలు అందరూ సాదరంగా స్వాగతం పలికారు. బోనాలు, కోలాటాలతో గ్రామ ప్రజలు రేవంత్ రెడ్డికి హెలి ప్యాడ్ నుంచి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివఋద్ధి కార్యక్రమాలకు శంకు స్థాపనలను చేయనున్నారు.


Tags:    

Similar News