Telangana : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ కమిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ కమిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందిరమ్మ కమిటీల నియామకం చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, మున్సిపాలిటీలో కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గ్రామ సర్పంచ్ తో పాటు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇందిరమ్మ కమిటీలను...
కన్వీనర్ గా గ్రామ పంచాయతీ కార్యదర్శి, మహిళ సంఘాల నుంచి ఇద్దరు సభ్యులతో పాటు కమిటీలో ఎస్సీ, బీస సభ్యులు ఉండేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లతో పాటు వార్డు మెంబర్లు కూడా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమయినట్లు అర్థమవుతుంది.