Revanth Reddy : న్యాయవ్యవస్థపై రేవంత్ లెటెస్ట్ ట్వీట్

భారత న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు.

Update: 2024-08-30 05:28 GMT

భారత న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు కావడంపై తాను చేసిన వ్యాఖ్యలు పత్రికల్లో తప్పుగా ప్రచురితమయ్యాయని తెలిపారు. తాను చేయని కామెంట్స్ చేసినట్లు ప్రచురించారన్నారు.

తనకు గౌరవమంటూ
న్యాయవ్యవస్థ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. తాను ఎప్పుడూ న్యాయవ్యవస్థ ఇచ్చిన ఉత్తర్వులను కించపర్చలేదని ఆయన తెలిపారు. కొన్ని పత్రికల్లో అలా తప్పుగా ప్రచురితమయ్యాయని ఆయన అన్నారు.


Tags:    

Similar News