నేడు జనగామకు కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజ్యాంగం మార్చాలంటూ వ్యాఖ్యలు చేసిన తర్వాత తొలి సారి కేసీఆర్ బహిరంగసభలో ప్రసంగించనున్నారు. జనగామ జిల్లాలో ఏర్పాటు చేయడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. జనగామ జిల్లాలో ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య పోరు నడుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటన టెన్షన్ పెడుతుంది.
ముందస్తు అరెస్ట్ లు...
బీజేపీ నేతలను ముందస్తు అరెస్ట్ లు చేయనున్నారు. సభకు సమీపంలో బీజేపీ నేతలు వచ్చి నిరసన తెలిపే అవకాశముందన్న ఇంటలిజెన్స్ నివేదికతో పోలీసు శాఖ అప్రమత్తమయింది. జనగామలో బీజేపీ నేతలందరినీ ముందస్తుగానే హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సభకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు పోలీసులు పెద్దయెత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు.
భారీ బహిరంగ సభ....
కేసీఆర్ నేడు జనగామ జిల్లాలో కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రాంగణలంలోనే అన్ని కార్యాలయాలను నిర్మించారు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. సభకోసం భారీ సంఖ్యలో ప్రజలను సమీకరిస్తున్నారు. కేసీఆర్ ప్రధాని మోదీని విమర్శలు చేసిన తర్వాత తొలి సభ కావడంతో సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ శ్రేణులు పెద్దయెత్తున ప్రజలను సమీకకరిస్తున్నారు. ఈ సభలో కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోదీ విషయంలో మరోసారి విరుచుకుపడే అవకాశం ఉంది.