ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

ఎంతో మంది విద్యార్థుల ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదల అయ్యాయి. ఉదయం 09.30 గంటలకు మంత్రి

Update: 2023-05-25 04:31 GMT

ఎంతో మంది విద్యార్థుల ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదల అయ్యాయి. ఉదయం 09.30 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిజల్ట్స్ ను ప్రకటించారు. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఆడిటోరియంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 80 శాతం, అగ్రికల్చర్‌లో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ https://eamcet.tsche.ac.in/ లో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్ పరీక్షలకు మొత్తం 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 3,20,683 దరఖాస్తులు రాగా, వీటిలో 3,01,789 మంది విద్యార్థలు పరీక్షలు రాశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ లకు సంబంధించిన కోర్సుల్లో ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహించి అడ్మిషన్లు ఇస్తారు. 

ఎంసెట్ వెబ్ సైట్ లో ఇలా చూసుకోండి..

- ముందుగా అభ్యర్థులు //https://eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

- హోం పేజీలో ఎంసెట్ రిజల్ట్స్ 2023 సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ పై క్లిక్ చేయండి.

- ఆ వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్, డేట్‌ ఆఫ్‌ బర్త వివరాలు ఎంటర్‌ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.

- మీ రిజల్ట్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది. ఫలితాల కాపీని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోని ఫ్యుచర్‌ అవసరాల కోసం భద్రపరుచుకోండి.

Tags:    

Similar News