ఇద్దరికీ భారీ నజరానాలు

క్రీడారంగంలో అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది

Update: 2022-06-01 13:26 GMT

క్రీడారంగంలో అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నిఖత్ జరీన్, ఇషాసింగ్ లకు కేసీఆర్ ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించారు. బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ లో ఇంటి స్థలాన్ని కేటాయిస్తామని పేర్కొన్నారు. ఇటీవల టర్కీలో జరిగిన అంతర్జాతీయ మహిళ బాక్సింగ్ పోటీల్లో నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే.

విలువైన ఇంటిస్థలం.....
అలాగే జర్మనీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీలలో ఇషాసింగ్ స్వర్ణ పతకం సాధించింది. ఇద్దరూ హైదరాబాదీయులే. వీరికి ఒక్కొక్కరికి రెండు కోట్ల నగదు పురస్కారాన్ని కేసీఆర్ ప్రకటించారు. అలాగే ఇంటి స్థలాన్ని కూడా కేటాయిస్తామని చెప్పారు. రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇద్దరికీ కేసీఆర్ స్వయంగా చెక్కులు అందించనున్నారు. ఇక కిన్నెరమెట్ల కళాకారుడు మొగిలయ్య కు కోటి రూపాయల నగదుకు సంబంధించి కూడా ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన కోరుకున్నట్లు బీఎన్ రెడ్డి నగర్ లో ఇంటి స్థలాన్ని కేటాయించనున్నారు.


Tags:    

Similar News