Telangana : నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్... ఒకే విడత పదకొండు వేలకు పైగా పోస్టులు

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.;

Update: 2025-03-22 08:48 GMT
unemployed, good news, revenue, telangana
  • whatsapp icon

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 10,954 పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖలో ఈ పోస్టులును భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్ఏల నుంచి ఆప్షన్లను తీసుకున్న తర్వాత మాత్రమే ఈ పదకొండు వేల పోస్లులకు సంబంధించిన నియమకాలు జరపనున్నారు.

ఉత్తర్వులు జారీ...
ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వుల జారీ చేసింది. గత ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారుల పోస్టులను రద్దు చేసిన నేపథ్యంలో తిరిగి గ్రామ రెవెన్యూ అధికారులను నియమించాలని నిర్ణయించింది. ఈ కొత్త పోస్టులకు జీపీవోలుగా నామకరణం చేశారు. జిల్లా పంచాయతీ ఆఫీసర్లుగా నామకరణం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News