Telangana : తెలంగాణకు మరో వరం.. గూగుల్ తో కీలక ఒప్పందం ఖరారు

తెలంగాణ ప్రభుత్వం గూగుల్ సేఫ్టే ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది.

Update: 2024-12-04 12:49 GMT

తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్ సేఫ్టే ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో గూగుల్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఇక్కడ తమ సంస్థకు చెందిన సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం కూడా చేసుకుంది.

సైబర్ నేరాలను అరికట్టేందుకు...
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంస్థ ఏర్పాటుతో ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సైబర్ సమస్యలకు హైదరాబాద్ కేంద్రంగా పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటిల్ స్కిల్ డెవలెప్ మెంట్ లో తెలంగాణ రాష్ట్రం ముందు వరసలో ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికే అనేక ఐటీకంపెనీల ప్రధాన శాఖలు హైదరాబాద్ లో ఏర్పాటు చేశాయన్నరేవంత్ రెడ్డి దాని వల్ల రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News