Breaking : ఏపీ, తెలంగాణలలో స్వల్ప భూ ప్రకంపనలు
ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది. పలుచోట్ల భూ ప్రకంపనలు కనిపించాయి
ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది. పలుచోట్ల భూ ప్రకంపనలు కనిపించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ భూప్రకంపనాలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ మండలాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లు ప్రత్యక్ష సాక్షలుు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లోనూ....
అలాగే రంగారెడ్డి, హనుమకొండ, వరగంల్ జిల్లాలోనూ భూ ప్రకంపనలు స్వల్పంగా కనిపించాయి. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, జగ్గయ్యపేటలలోనూ భూమి స్వల్పంగా కంపించినట్లు ప్రజలు తెలిపారు. ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే స్వల్ప భూ ప్రకంపనలు కావడంతో, కొన్ని సెకన్లు మాత్రమే భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.