పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. ఆయన క్వాష్ పిటీషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. ఆయన క్వాష్ పిటీషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. లగచర్ల ఘటనలో తనపై నమోదయిన కేసులను క్వాష్ చేయాలంటూ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశారు. కింది కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలన్న ఆయన పిటీషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.
బెయిల్ పిటీషన్ ను...
దీన్ని హైకోర్టు కొట్టివేడయంతో పాటు, మెరిట్స్ ఆదారంగా బెయిల్ పిటీషన్ ను పరిశీలించాలని కింద కోర్టును హైకోర్టు ఆదేశించింది. లగచర్ల ఘటన కేసులో పట్నం నరేందర్ రెడ్డి కొద్ది రోజులుగా జైలులో ఉన్నారు. క్వాష్ పిటీషన్ కొట్టివేయడంతో ఇంక ఆయన బెయిల్ పిటీషన్ పై ఆధారపడక తప్పదని న్యాయనిపుణులు చెబుుతన్నారు.