Revanth Reddy : పెద్దపల్లి వాసులకు శుభవార్త చెప్పిన రేవంత్

పెద్దపల్లికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాలను ప్రకటించారు. పెద్దపల్లిలో జరిగిన యువవికాసం సభలో ఆయన ప్రసంగించారు

Update: 2024-12-04 13:38 GMT

పెద్దపల్లికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాలను ప్రకటించారు. పెద్దపల్లిలో జరిగిన యువవికాసం సభలో ఆయన ప్రసంగించారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని వందపడకల సామర్థ్యానికి పెంచుతూ నిర్ణయించారు.పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో రెండు కొత్త ఆర్టీసీ డిపోలను ఏర్పాటు చేశారు. యువ వికాసం సభలో8,084 మంది గ్రూప్ 4 సిబ్బందికి నియామక పత్రాలను అందచేశారు. పెద్దపల్లికి నాలుగువరసల బైపాస్ రోడ్డును కూడా మంజూరు చేశారు. పెద్దపల్లి జిల్లాను ప్రత్యేకంగా తాము గుర్తిస్తామని రేవంత్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది పెద్దపల్లి వాసులేనని ఆయన అన్నారు. తెలంగాణను సాధించుకుంది మన కోరికలను నెరవేర్చుకునేందుకేనని ఆయన అన్నారు. ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ రావాలని ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారన్నారు. కానీ పదేళ్ల నుంచి మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు రాలేదన్నారు.

గత ప్రభుత్వం పదేళ్ల నుంచి...
గతంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ రైతులకు గిట్టుబాటు ధర రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నారంటే తెలంగాణలో ప్రజాపాలన నడుస్తున్నట్లు అని ఆయన తెలిపారు. అయినా కొందరు కాళ్ల కింద కట్టెలు పెట్టడానికి అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నారన్నారు. గత పదేళ్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక సాగునీటి ప్రాజెక్టునూ గత ప్రభుత్వం పూర్తిచేయలేకపోయిందన్నారు. ఈ ఏడాది కాలంలో అనేక అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పనులను చేపట్టామన్నారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. తొలి ఏడాది 55,000 పోస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిందని, ఇది నిజంగా యువ వికాసం కాదా? అని ప్రశ్నించారు.


Tags:    

Similar News