Bandi Sanjay : ఏడాది కాంగ్రెస్ పాలనపై బండి ధ్వజం
ఏడాది కాంగ్రెస్ పాలనపై కేంద్ర మంత్రి బండిసంజయ్ విమర్శలు చేశారు.
ఏడాది కాంగ్రెస్ పాలనపై కేంద్ర మంత్రి బండిసంజయ్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన అరాచక పాలన అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఇది కాంగ్రెస్ విజయమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పిల్లలకు పురుగులన్నం పెట్టడం, వారి మరణాలకు ఉత్సవం అంటూ ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం విజయం వారికి సంకెళ్ళు వేయడం ఉత్సవం అని, రైతులను మోసం చేయడం విజయం అని సెటర్ వేశారు.
రెండు పార్టీలూ ఒక్కటేనంటూ...
వారికి ఉరితాళ్లు వేయడం ఉత్సవం అని, ఆడబిడ్డలను మోసం చేయడం విజయం, వారి కన్నీళ్లు ఉత్సవం, ఇళ్లు ఇస్తామని మోసం చేయడం, ఉన్న ఇళ్లను కూల్చడం ఉత్సవం, రుణమాఫీ చేస్తామని మాట తప్పడం విజయం, అప్పులకు నోటీసులు ఇవ్వం విజయం అంటూ బండి సంజయ్ విమర్శించారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, పాలన కూడా సేమ్ టు సేమ్ అని అన్నారు.