మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడికి హైకోర్టులో చుక్కెదురు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది.

Update: 2024-12-04 12:29 GMT

Telangana high court

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. డిసెంబరు 16వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ప్రజాభవన్ ఎదుట బ్యారికేడ్లను ఢీకొట్టిన ఘటనలో ఆయనపై కేసు నమోదయింది. కేసు నమోదయిన తర్వాత సాహిల్ దుబాయ్ కు వెళ్లిపోయాడు.

దుబాయ్ లో ఉంటూ...
అప్పటి నుంచి దుబాయ్ లోనే సాహిల్ ఉంటున్నాడు. అయితే దీనిపై విచారణ చేసిన హైకోర్టు పోలీసు విచారణకు సహకరించాలని సాహిల్ ను ఆదేశించింది. డిసెంబరు 16వ తేదీన హాజరు కావాలని కోరింది. మరి దుబాయ్ లో ఉన్న సాహిల్ ఈ నెల 16వ తేదీన కోర్టు ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసుల ఎదుటకు విచారణకువస్తారా? లేదా? అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.


Tags:    

Similar News