థాయిలాండ్ లో తప్పిపోయిన ఇద్దరు తెలంగాణ వాసులు 

థాయిలాండ్ లో ఇద్దరు తెలంగాణ వాసులు తప్పిపోయారు.;

Update: 2024-12-04 04:12 GMT
aravind, konda sagar,  missing, thailand
  • whatsapp icon

థాయిలాండ్ లో ఇద్దరు తెలంగాణ వాసులు తప్పిపోయారు. నిజమాబాద్ జిల్లా షెట్ పల్లికి చెందిన శనిగరపు అరవింద్, జగిత్యాల జిల్లా ఆత్మకూరు కు చెందిన కొండ సాగర్ నవంబరు 11న ముంబయి నుంచి బ్యాంకాక్ కు వెళ్లారు. అక్కడి నుంచి అందుబాటులో లేకుండా పోయారు. 21వ తేదీ నుంచి వారి ఆచూకీ తెలియడం లేదని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏజెంటుకు రెండు లక్షల రూపాయలు చొప్పున చెల్లించి విజిట్ వీసాపై ఉద్యోగం కోసం థాయిలాండ్ కు వెళ్లిన ఇద్దరు తెలంగాణ వాసులు అక్కడ తప్పిపోయిన సంఘటన జరిగింది.

ఏజెంట్ పై చర్యలు తీసుకోవాలని...
అరవింద్ భార్య జల, సాగర్ భార్య కాశమ్మ మంగళవారం హైదరాబాద్ లోని ప్రవాసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వారివెంట కాంగ్రేస్ ఎన్నారై సెల్ నాయకులు డా. బిఎం వినోద్ కుమార్, మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు ఉన్నారు. థాయిలాండ్ లో తప్పిపోయిన ఇద్దరి ఆచూకీ తెలుసుకోవాలని, ఏజెంట్ పై పోలీసు కేసు నమోదు చేయాలని వారు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News