ఆ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలోపలు కీలక నిర్ణయాలు..

Update: 2023-08-18 03:54 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలోపలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాంట్రాక్ట్‌ పద్దతిన కొనసాగుతున్న ఉద్యోగులను సైతం పర్మినెంట్‌గా చేసేస్తున్నారు. అలాగే ఔట్‌సోర్సింగ్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందించే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్, పద్దతిలో కొనసాగుతున్న 378 మంది ఉద్యోగులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ది శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ఈనెల 11వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సెర్ప్‌లో పనిచేస్తున్నటువంటి 3,974 మంది ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పేస్కేల్‌ వర్తించేలా గత నెల నెలలో రాష్ట్రపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తాజాగా ఈ రెండు జీవోలు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.

అయితే ఈ పేస్కేల్‌ వర్తిపు ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఇక మెప్మా, సెర్ప్‌‌లలో పనిచేసే ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. ప్రస్తుత కనీస వేతనానికి సమీపంలో ఉన్నటువంటి పేస్కేళ్లను రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేయనుంది. అలాగే మెప్మా ఉద్యోగులకు ప్రస్తుత కనీస వేతనానికి కూడా రక్షణ కల్పించనున్నారు. అలాగే సెర్ప్‌ ఉద్యోగుల ప్రస్తుత స్థూల వేతనం, ఇతర అలవెన్సులకు వంటి ప్రభుత్వ సదుపాయాలు సైతం వర్తించనున్నాయి. అలాగే ఈ ఉద్యోగులకు వర్తించే విధంగానే రిజిస్టర్డ్‌ సొసైటీ ఉద్యోగులుగా కొనసాగుతారని ప్రభుత్వ తెలిపింది. ఉద్యోగం విషయంలో ఎలాంటి మార్పు కూడా ఉండదని స్పష్టం చేసింది. స్టేట్‌ మిషన్‌ డైరెక్టర్లకు మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–2, డిస్ట్రిక్ట్‌ మిషన్‌ కోఆర్డినేటర్లకు సూపరింటెండెంట్, ఎంఐఎస్‌ మేనేజర్లకు సీనియర్‌ అసిస్టెంట్, ఆఫీస్‌ సబా ర్డినేట్లకు ఆఫీస్‌ సబార్డినేట్‌ ఇంకా తదితర ఉద్యోగులకు రాష్ట్ర  ప్రభుత్వం పే–స్కేళ్లను వర్తింపజేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాంట్రాక్ట్ ఉద్యోగులపై ప్రేమ చూపిస్తున్నారు. వారికి అన్ని విధాలుగా ఆదుకునే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్ననేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వనున్నట్లు ఉత్తర్వులు జారీ కావడంతో ఆ ఉద్యోగుల్లో ఆనందం అంతా ఇంతా కాదు. అలాగే తమను ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా గుర్తించకుండా పర్మినెంట్‌ ఉద్యోగులుగా గుర్తించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:    

Similar News