కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్ హైకోర్టు.. ప్రత్యక్ష విచారణలు బంద్

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డివిజన్,;

Update: 2022-01-04 12:22 GMT
corona, high court, telangana, positive cases
  • whatsapp icon

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డివిజన్, సింగిల్ బెంచ్ లలో ప్రత్యక్ష విచారణలను నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటన చేసింది హైకోర్టు. కాగా.. వ్యక్తిగత హోదాలో జడ్జిలు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. ప్రత్యక్ష విచారణ జరుపుకోవచ్చునని పేర్కొంది. ఆన్ లైన్ విచారణ లేక.. ఆఫ్ లైన్ విచారణ అన్న నిర్ణయాన్ని వారి ఇష్టానికే వదిలేసింది హైకోర్టు.

Also Read : 
సంగారెడ్డిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య !
తెలంగాణలో కోవిడ్, ఒమిక్రాన్ ల వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టు వెల్లడించింది. ప్రత్యక్ష విచారణ చేపట్టాలని జడ్జిలు భావించినట్టయితే, న్యాయవాదులతో పాటు కక్షిదారులు కూడా కొవిడ్ మార్గదర్శకాలు తప్పనిసరిగా అనుసరించాలని, మాస్కులు ధరించడంతో పాటు శానిటైజేషన్, భౌతికదూరం నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.


Tags:    

Similar News