రేపట్నుంచి కాలేజీలకు దసరా సెలవులు.. యాజమాన్యాలపై కఠిన చర్యలు

పెద్ద పండుగలకు భాగ్యనగరమంతా ఖాళీ అయిపోతుంది. వారంరోజుల క్రితమే స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించడంతో..

Update: 2022-10-01 13:10 GMT

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలన్నింటికీ ఇంటర్మీడియట్ బోర్డు దసరా సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి ఈనెల 9వ తేదీ వరకూ అన్ని యాజమాన్యాలు జూనియర్ కాలేజీలకు సెలవులు పాటించాలని.. తిరిగి 10వ తేదీ నుంచి కాలేజీలను పునః ప్రారంభించాలని బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కో ఆపరేటివ్, గురుకుల జూనియర్ కాలేజీలన్నీ విద్యార్థులకు దసరా సెలవులివ్వాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది. దసరా సెలవుల్లో విద్యార్థులకు కాలేజీలు, స్పెషల్ క్లాసులు నిర్వహిస్తే.. సంబంధిత యాజమాన్యంపై కఠిన చర్యలుంటాయని తెలిపింది.

పెద్ద పండుగలకు భాగ్యనగరమంతా ఖాళీ అయిపోతుంది. వారంరోజుల క్రితమే స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి తల్లిదండ్రులంతా నవరాత్రి, బతుకమ్మ వేడుకల కోసం సొంత ఊర్లకు చేరుకున్నారు. ఇప్పటికీ హైదరాబాద్ సగం ఖాళీ అయిపోయింది. కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించడంతో.. చాలా మంది సొంతఊర్లకు పయనమయ్యారు. దీంతో రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి ఏపీకి సొంత వాహనాల్లో వస్తుండటంతో.. టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.



Tags:    

Similar News