తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతా ఇది ఫిక్స్
తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు
తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానన్న వార్తల్లో నిజం లేదన్న ఆయన పార్టీ అధికారంలో లేని సమయంలో పోటీ చేసిన వాడే నాయకుడు అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న పార్టీలో పోటీ చేసేంందుకు ఎవరైనా ముందుకు వస్తారని, అయితే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోటీ చేసిన వాడే అసలైన లీడర్ అని అన్నారు. తాను ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి పార్లమెంటు నుంచి పోటీ చేయడానికి రెడీ అని ఆయన ప్రకటించారు.
అవసరమైతే సోనియాపై కూడా....
పార్టీ ఆదేశిస్తేనే తాను పోటీకి దిగుతానని ఆయన తెలిపారు. పార్టీ వద్దంటే పోటీ చేయబోమని కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. టిక్కెట్ రాలేదని పార్టీని వీడనని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను ఎప్పుడూ దూరంగానే ఉంటున్నానని, కాంగ్రెస్ కు దగ్గరయితే తన కుమారుడు అమిత్ రెడ్డికి ఎందుకు బీఆర్ఎస్ టిక్కెట్ అడుగుతానని ఆయన ప్రశ్నించారు కేటీఆర్ ను తానే కలవాలని అనుకున్నానని, అయితే ఆయనే వచ్చి తనను కలిశారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. సోనియా గాంధీపై పోటీ చేయమన్నా తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.