అమెరికా పర్యటనకు కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. పదిరోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు
తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. పదిరోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. ఈరోజు అమెరికాకు బయలుదేరుతున్న కేటీఆర్ ఈ నెల 29 వరకూ అమెరికాలోనే ఉంటారు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ఆయన అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.
పెట్టుబడుల కోసం...
కేటీఆర్ అమెరికాలోని తూర్పు, పశ్చిమ, కోస్తా ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలతో సమావేశం కానున్నారు. కేటీఆర్ వెంట ఐటీ, పరిశ్రమల శాఖకార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఎలక్ట్రానిక్స్ డైరెరక్టర్ సుజయ్ కూడా అమెరికా వెళుతున్నారు. ఈ నెల 20న శాండియాగో, 21న శాన్‌జోన్, 24న బోస్టన్, 25న న్యూయార్క్ లో కేటీఆర్ బృందం పర్యటించనుంది.