మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బిగ్ రిలీఫ్
తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది.
తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల అఫడవిట్‌లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారంటూ రాఘవేంద్రరాజు అనే వ్యక్తి పిటీషన్ వేశారు. శ్రీనివాసగౌడ్ ఎన్నిక చెల్లదన్న పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అఫడవిట్ ను ట్యాంపరింగ్ చేశారంటూ పిటీషన్ లో రాఘవేంద్రరాజు పేర్కొన్నారు.
పిటీషనర్ వాదనలతో...
అయితే పిటీషనర్ వాదనలతో హైకోర్టు ఏకీభవించలేదు. అన్నీ సక్రమంగానే ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. దీంతో మంత్రి శ్రీనివాసగౌడ్ ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటీషన్ కొట్టివేసింది. పిటీషనర్ ఆరోపణలతో హైకోర్టు ఏకీభవించకుండా ఆయనపై వేసిన పిటీషన్ ను కొట్టి వేయడంతో మంత్రి శ్రీనివాసగౌడ్ కు రిలీఫ్ దక్కింది.