సంక్రాంతికి గుడ్ న్యూస్.. ప్రత్యేక సర్వీసులు
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది.
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. మొత్తం 4,233 సర్వీసులను వివిధ ప్రాంతాలకు నడపాలని నిశ్చయించింది. జనవరి 7వ తేదీనుంచి పదిహేనో తేదీ వరకూ ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నాయని అధికారులు తెలిపారు. వీటిలో 585 బస్సులకు ముందుగా రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారుక.
పది శాతం ఎక్కువ...
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా పది శాతం బస్సులను ఆర్టీసీ నడపాలని నిర్ణయించిందని ఆయన చెప్పారు. అమలాపురం, కాకినాడ, కందుకూరు, విశాఖపట్నం, రాజమండ్రితో పాటు ఆంధ్రప్రదేశ్ లోని మరికొన్ని ప్రాంతాలకు ఈ బస్సు సర్వీసులను నడుపుతున్నామని ఆయన చెప్పారు. రిజర్వేషన్ ముందుగా చేసుకునే గడువును ముప్ఫయి రోజుల నుంచి అరవై రోజులకు పెంచామని తెలిపారు.