Telangana : గ్రూప్ వన్ పరీక్షలకు రెడీ అయిన సర్కార్.. టెన్షన్

గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయింది. రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకూ గ్రూప్ వన్ పరీక్షలు జరగనున్నాయి.

Update: 2024-10-20 12:47 GMT

గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయింది. రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకూ గ్రూప్ వన్ పరీక్షలు జరగనున్నాయి. టీజీపీఎస్‌సీ ఆధ్వర్యంలో ఈ గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. అన్ని పరీక్ష కేంద్రాలను ఇప్పటికే సిద్ధం చేశారు. మొత్తం మూడు జిల్లాల్లో 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రేపటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసు పహారా మధ్య గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.

పరీక్ష కేంద్రాల వద్ద...
హాల్ టిక్కెట్ ఉన్న వారిని మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారని అన్నారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి పరీక్ష కేంద్రాలవైపు వస్తే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మెయిన్స్ కు ఎంపికయిన అభ్యర్థులు తప్ప మరెవ్వరికీ ఆ పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించకూడదన్నారు. పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్ ను విధింాచారు. జీవో నెంబరు 29ను దర్దు చేయాలంటూ గత కొంతకాలంగా గ్రూప్ వన్ అభ్యర్థులు ఆందోళన దిగిన నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు. జవాబు పత్రాలను తరలించేందుకు తొలి సారి జీపీఎస్ ట్రాకింగ్ ను ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News