కొత్త డీజీపీ ఎవరు?

తెలంగాణ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది;

Update: 2022-12-09 05:18 GMT
mahender reddy, dgp, retirement
  • whatsapp icon

తెలంగాణ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఆయన స్థానంలో కొత్త వారు ఎవరు వస్తారన్న దానిపై ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సీనియారిటీని బట్టి డీజీపీ పదవి వరిస్తుంది. ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేస్తున్న దానిపై పోలీసు వర్గాల్లో చర్చ మొదలయింది.

సీనియారిటీ ప్రకారం...
సీనియారిటీ ప్రకారం చూసుకుంటే ఉమేష్ షరాఫ్, రవి గుప్తా, అంజనీకుమార్, సీవీ ఆనంద్, రాజీవ్ రతన్, జితేందర్ లు డీఐజీ రేసులో ఉన్నారు. ఈ జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం మూడు పేర్లను యూపీఎస్సీకి సిఫార్సు చేస్తుంది. వారిలో ఒకరిని డీజీపీగా ప్రభుత్వం నియమిస్తుంది. అయితే ఎవరికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పిస్తారన్న చర్చ జరుగుతుంది. ఎన్నికల సమయం కావడంతో నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ ఐపీఎస్ వర్గాల్లో నెలకొంది.


Tags:    

Similar News