Nara Bhuvaneswari : నేటి నాలుగు రోజులు భువనేశ్వరి పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి ఏపీలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు;

Update: 2024-03-26 02:23 GMT
Nara Bhuvaneswari : నేటి నాలుగు రోజులు భువనేశ్వరి పర్యటన
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి ఏపీలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. నిజం గెలవాలి పేరుతో ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును స్కిల్ డెవెలెప్‌మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేసినప్పుడు ప్రాణాలు కోల్పోయిన టీడీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ నారా భువనేశ్వరి ఈ యాత్ర చేేస్తున్నారు. మృతి చెందిన కార్యకర్తలకు పార్టీతో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు.

కుటుంబాలకు పరామర్శ...
నారా భువనేశ్వరి నేడు పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. 27న తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, గన్నవరంలో పర్యటిస్తారు. 28న నూజీవీడు, పెనమలూరు, గుడివాడలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. 29వ తేదీన మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. భువనేశ్వరి పర్యటనకు సంబంధించి పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.


Tags:    

Similar News