ఎమ్మెల్యే సోదరుడికి దళిత బంధు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య తన తమ్ముడికి దళిత బంధు పథకాన్ని వర్తింప చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
తెలంగాణలో దళిత బంధు పథకం పక్క దారి పడుతుంది. ఎమ్మెల్యేలే తమ కుటుంబ సభ్యులకు ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. లబ్దదారుల ఎంపిక బాధ్యతను ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకే అప్పగించారు. అదే వారి పాలిట వరంగా మారింది.
సర్పంచ్ గా....
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య తన తమ్ముడికి దళిత బంధు పథకాన్ని వర్తింప చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజయ్య సోదరుడు తాటికొండ సురేష్ సర్పంచ్ గా కూడా పనిచేస్తున్నారు. దళిత బంధు పథకాన్ని అందరికీ వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినప్పటికీ తొలి జాబితాలోనే ఎమ్మెల్యే రాజయ్య తన సోదరుడికి ఈ పథకాన్ని వర్తింప చేయడం చర్చనీయాంశమైంది. ఈ పథకం టీఆర్ఎస్ కార్యకర్తలకే మేలు జరుగుతందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.