TS Inter 2024: నేటి నుండి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) రాష్ట్రంలో ఇంటర్
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) రాష్ట్రంలో ఇంటర్ 2024 సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. TS ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 2024 మే 24 నుండి షెడ్యూల్ చేశారు. TS ఇంటర్ 2024 సప్లిమెంటరీ పరీక్ష అడ్మిట్ కార్డ్ అధికారికంగా జారీ చేయబడింది.
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నారు. జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. సెకెండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటలకు వరకు నిర్వహిస్తారు. సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 4 నుండి జూన్ 8 వరకు షెడ్యూల్ చేశారు. TS ఇంటర్ 2024 ప్రాక్టికల్ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది. ఉదయం (ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు), మధ్యాహ్నం (మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకు) సాగనుంది. ఇంగ్లీష్ ప్రాక్టికల్ సెషన్‌లు మొదటి సంవత్సరం విద్యార్థులకు జూన్ 10, 2024న ఉదయం 9 గంటల నుండి నిర్వహించనున్నారు.