తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు షాక్.. సంక్రాంతి సెలవులు రెండురోజులే..
వాటిలో 15వ తేదీ ఆదివారం.. అంటే రెండు రోజులే సంక్రాంతి సెలవులు. తిరిగి 17వ తేదీన గవర్నమెంట్, ప్రైవేట్, ఎయిడెడ్..
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలతో పాటు.. గురుకులాలకు షాకిచ్చింది ఇంటర్ బోర్డు. ఈ నెల 14, 15, 16 తేదీలను మాత్రమే సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది. వాటిలో 15వ తేదీ ఆదివారం.. అంటే రెండు రోజులే సంక్రాంతి సెలవులు. తిరిగి 17వ తేదీన గవర్నమెంట్, ప్రైవేట్, ఎయిడెడ్, కో ఆపరేటివ్, రెసిడెన్షియల్, కేజీబీవీ కాలేజీలన్ని రీ ఓపెన్ చేయాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ సందర్భంగా ఆ 3 రోజులే సెలవులు ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. జనవరి 13 నుండి 17 వరకూ సెలవులు ప్రకటించింది తెలంగాణ సర్కార్. వాటిలోనూ.. రెండో శనివారం, ఆదివారం ఉండటంతో సంక్రాంతి సెలవుల్ని కోల్పోయామని విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ ఏడాది దాదాపు పండుగలన్నీ ఆదివారాల్లోనే వచ్చాయి. ఇది ప్రభుత్వానికి ప్లస్ పాయింటే కానీ.. ఉద్యోగులకు పండుగ సెలవులు పోయినట్లే.