Telangana : ఐపీఎస్ ల బదిలీలు... అంజనీకుమార్, సీవీ ఆనంద్‌లకు భలే పోస్టింగ్‌లు ఇచ్చారే

తెలంగాణలో 20 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. కొందరికి పదోన్నతులు కల్పించారు

Update: 2023-12-19 14:48 GMT

  ips officers transferred in telangana

తెలంగాణలో 20 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. కొందరికి పదోన్నతులు కల్పించారు. రవి గుప్తాను డీజీపీగా కంటిన్యూ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మాజీ డీజీపీ అంజనీకుమార్ ను రోడ్ సేఫ్టీ అధారిటీ ఛైర్మన్ గా నియమించారు. జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రాను నియమించారు. హోంగార్డు ఐజీగా స్టీఫెన్ రవీంద్రను నియమించారు. రైల్వే డీజీగా మహేశ్ భగవత్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏసీబీ డీజీగా...
ఎస్‌బీఐ చీఫ్ గా సుమతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా అభిషేక్ బిస్తీని నియమించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ గా కమలాసన్ రెడ్డినినియమించారు. ఐజీ పర్సనల్ గా చంద్రశేఖర్ రెడ్డిని నియమిచంారు. ఏసీబీ డీజీగా సీీవీ ఆనంద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ చీఫ్ గా శిఖా గోయల్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ డీఐజీగా రమేష్ నాయుడును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరికొందరు అధికారులకు పదోన్నతులు కల్పించారు.


Tags:    

Similar News