కలెక్టర్ పై కేంద్రమంత్రి నిర్మల ఫైర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2022-09-02 07:21 GMT

కామారెడ్డి జిల్లా కలెక్టర్ పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె కామారెడ్డి జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్న నిర్మలా సీతారామన్ రేషన్ దుకాణాన్ని సందర్శించారు. అక్కడ మోదీ ఫొటో లేకపోవడాన్ని తప్పు పట్టారు. పక్కనే ఉన్న జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ పై నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచితంగా ఇచ్చే బియ్యంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? అని కలెక్టర్ ను ప్రశ్నించారు.

మోదీ ఫొటో లేకపోవడంపై....
నిర్మలా సీతారామన్ ప్రశ్నలకు కలెక్టర్ సమాధానం చెప్పలేకపోవడంతో ఆయనపై మండి పడ్డారు. ప్రజలకు తెలియకపోవడమంటే సరే.. అధికారులకే విషయం తెలియకపోతే ఎలా అని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. అరగంట సమయంలో రేషన్ బియ్యంలో కేంద్రం, రాష్ట్ర వాటా ఎంతో తెలుసుకుని చెప్పాలని ఆమె ఆదేశించారు. రేషన్ షాపుల వద్ద ప్రధాని మోదీ ఫొటోను ఖచ్చితంగా ఉంచాలని, లేకుంటే తానే వచ్చి పెడతానని ఆమె ఫైర్ అయ్యారు.


Tags:    

Similar News