ఉపేంద్రనాథ్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
మోసాలు వెలుగు చూడటంతో తెలంగాణ ప్రభుత్వం మల్టీలెవల్ మార్కెటింగ్‌పై నిషేధం విధించింది. కర్ణాటకకు చెందిన రాజేష్‌ఖన్నా
హైదరాబాద్ కేంద్రంగా మల్టీ లెవల్ మార్కెటింగ్ అంటూ మోసాలకు పాల్పడిన క్యూనెట్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు సీహెచ్.ఉపేంద్రనాథ్‌రెడ్డిని అరెస్ట్ చేసినట్టు సీసీఎస్ డీసీపీ కె.శిల్పవల్లి మంగళవారం తెలిపారు. సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని కాల్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు ఉద్యోగులు దుర్మరణం పాలవడంతో క్యూ నెట్ వ్యవహారం తెరపైకి వచ్చింది. కొన్నేళ్ల క్రితం సంస్థను మూసేసినా మళ్లీ మరో పేరుతో కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో గత మూడు నెలలుగా అజ్ఞాతంలో ఉంటూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న ఉపేంద్రనాథ్ రెడ్డి బెంగళూరులో తలదాచుకున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు సోమవారం అక్కడ అదుపులోకి తీసుకుని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు వారెంట్‌పై హైదరాబాద్ కు తరలించారు.