BJP : బీజేపీకి విజయశాంతి రాజీనామా... రీజన్ అదే
భారతీయ జనతా పార్టీకి విజయశాంతి రాజీనామా చేశారు. అమె తన ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
భారతీయ జనతా పార్టీకి విజయశాంతి రాజీనామా చేశారు. అమె తన ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. అయితే తాను ఏ పార్టీలో చేరబోతున్నదీ ఆమె చెప్పలేదు. ఆమె కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయి. ఈ నెల 17న తెలంగాణకు రాహుల్ గాంధీ వస్తున్న సందర్భంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. ఇప్పటికే విజయశాంతి తమ పార్టీలో చేరతారన్న విషయాన్ని మల్లు రవి చెప్పిన సంగతి తెలిసిందే.
జనసేన తో పొత్తు...
ప్రధానంగా విజయశాంతి రాజీనామా చేయడానికి కారణం జనసేనతో పొత్తు పెట్టుకోవడం కారణమేనని చెబుతున్నారు. జనసేనతో పొత్తు ఆమెకు ఇష్టం లేదని తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఎన్డీఏలోకి ఆహ్వానించిన నాటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మోదీ సభలకు కూడా హాజరు కాకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఆమె చేసిన ట్వీట్ కూడా అలాగే ఉంది. తరతరాలు పోరాడిన మా తెలంగాణ ఉద్యమకారులు ప్రాంతేతర పార్టీలను ఎన్నికల పరంగా ఆమోదించరు అని ట్వీట్ చేశారంటే అది జనసేన గురించి అని చర్చించుకుంటున్నారు. తెలంగాణ సెటిలర్స్ అనే భావన ఎవరికీ లేదని, ఇక్కడ ఉనన వారంతా తెలంగాణ ప్రజలేనని ఆమె ట్వీట్ చేశారు.