వీళ్లను చూసి నేర్చుకోవాల్సిందే...

మనిషి తలచుకుంటే చేయలేదని ఏమీ ఉండదని నిరూపించారు తెలంగాణలోన నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలం కల్లూరు వాసులు

Update: 2023-09-01 11:52 GMT

వీళ్లను చూసి నేర్చుకోవాల్సిందే...

మనిషి తలచుకుంటే చేయలేదని ఏమీ ఉండదని నిరూపించారు తెలంగాణలోన నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలం కల్లూరు వాసులు. ఆ ఊరి పురుషులంతా ఒక పొదుపు సంఘాన్ని, సొంతంగా మినీబ్యాంకును ఏర్పాటు చేసుకుని రుణాలు ఇస్తున్నారు. ప్రభుత్వం, బ్యాంకులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఇలా ఎవరి సాయం లేకుండానే ఆర్థిక స్వాలంబన వైపు అడుగులు వేస్తున్నారు. బ్యాంకు రుణాలు అందకపోవడం,ప్రైవేటు సంస్థల వద్ద ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవడంతో తీర్చలేక కుటుంబాలు అతలాకుతలం అవడంతో, ఆర్థికంగా స్వంతకాళ్లపై నిలబడాలనే పట్టుదలతో గ్రామానికి చెందిన పురుషులు పొదుపు బాటలో పయనించారు. పొదుపు చేసుకున్న సొమ్మును సభ్యులకు రుణాలుగా ఇస్తూ లాభాలు ఆర్జించడంతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చుకుంటూ ఆర్థికపురోగాభివృద్ధి సాధిస్తున్నారు. రుణాల కోసం గ్రామస్తులు, రైతులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, పోతంగల్ సొసైటీ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి 1995లో పురుషుల పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేశారు.

మొదట 90 మంది సభ్యులతో నెలకు రూ.90 పొదుపు ప్రారంభించి, ఆపై నెలకు 100, 150 ఇలా పెంచుకుంటూ పోయారు. రుణాల మంజూరు వసూళ్ల కోసం ఆరుగురితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. మొదట్లో 90 మందితో ప్రారంభమైన ఈ సంఘం ప్రస్తుతం 360 మంది పైనే ఉన్నారు. ఈ సంఘం రూ.2 కోట్ల ట‌ర్నోవ‌ర్ తో నడుస్తోంది. పొదుపుపై ఒకటిన్నర రెట్లు అప్పు తీసుకునేందుకు సభ్యులకు సంఘం వీలు కల్పిస్తోంది. రుణం తీసుకున్న సభ్యుల నుంచి కేవలం రూపాయి వడ్డీ వసూలు చేస్తున్నారు. ఆదర్శ పురుషుల పొదుపు పరస్పర సహకార పరపతి సంఘం పేరుతో నిర్వహిస్తోంది. ఇలాంటిది మన ఊర్లో ఉంటే మన రైతులకు కూడా ఆర్థికంగా చేయూత నిస్తుంది...

Tags:    

Similar News