Telangana : రోడ్డుపైన చేపలు.. ఎగబడిన జనం

చేపలలోడుతో వెళుతున్న లారీ బోల్తా పడటంతో వాటి కోసం ప్రజలు ఎగబడ్డారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఈ ఘటన జరిగింది.;

Update: 2024-09-24 07:00 GMT
lorry  overturned, fish load, on road, mahabubabad district
  • whatsapp icon

చేపలలోడుతో వెళుతున్న లారీ బోల్తా పడటంతో వాటి కోసం ప్రజలు ఎగబడ్డారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఈ ఘటన జరిగింది. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళుతుండగా లారీ బోల్తా పడి చేపలన్నీ రోడ్లు పాలయ్యాయి. బతికున్న చేపల కోసం ప్రజలు పోటీ పడ్డారు. పోలీసులు అదుపు చేసినా ప్రజలు దొరికిన చేపలు దొరికినట్లు తీసుకెళ్లిపోయారు.

రోడ్డు పాలు కావడంతో...
చేపలన్నీ రోడ్డు పాలు కావడంతో పాటు లైవ్ ఫిష్ రోడ్డు మీద పడటంతో లారీ సిబ్బంది కూడా ఏమీ చేయలేక పోయారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా అడ్డుకోలేకపోయారు. మరోవైపు లారీ బోల్తాపడిన ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags:    

Similar News