మహిళా బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురండి: కవిత లేఖ

ఈ నెల 18 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశాల నేపథ్యంలో వివిధ రకాల బిల్లులపై కేంద్ర ప్రభుత్వంపై..

Update: 2023-09-05 04:25 GMT

ఈ నెల 18 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశాల నేపథ్యంలో వివిధ రకాల బిల్లులపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్ని రాజకీయ పార్టీలకు లేఖ రాశారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లును ఆమోదించాలని డమాండ్‌ ఆమె డిమాండ్‌ చేస్తున్నారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా బిల్లుల కోసం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలని ఆమె అన్ని రాజకీయ పార్టీలను కోరారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం అన్ని పార్టీలు మద్దతు పలకాన్నారు. మహిళా బిల్లు అనేది దేశానికి చాలా ముఖ్యమని, చట్ట సభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరుగుదల కారణంగా ప్రజాస్వామ్యం మరింతగా బలపడుతుందని లేఖలో పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ముందుడుగు వేసేందుకు మహిళల పాత్ర కీలకమని, ప్రజాప్రతినిధులకు ఈ పార్లమెంట్‌ సమావేశాలు ఎంతో ముఖ్యమన్నారు. చట్ట సభల్లో మహిళలకు చ ఓటు లభించడం లేదని అన్నారు. పార్టీల మధ్య ఉండే విబేధాలను పక్కనబెట్టి మోడీ సర్కార్‌పై మహిళా బిల్లుపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ముందురావాలన్నారు. సమాజంలో మహిళల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, దేశంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. దేశ జనాభాలో 50 శాతం వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అందుకే జరిగే పార్లమెంట్ సమావేశాలలో ఈ బిల్లుపై అందరు కలసి కట్టుగా ఒత్తిడి పెంచాలని కవిత కోరారు.

కాగా, సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అయితే కేంద్రం ముందున్న జమిలి ఎన్నికల విధానంపై కూడా చర్చ జరగనుంది. మరోవైపు అధికార పక్షం తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే చర్చ జోరందుకుంది. 

Tags:    

Similar News