సింగరేణిలో సమ్మె సైరన్

సింగరేణి లో కార్మికులు సమ్మెకు దిగనున్నారు. రెండు రోజుల పాటు ఈ సమ్మె జరగనుంది

Update: 2022-03-14 06:58 GMT

సింగరేణి లో కార్మికులు సమ్మెకు దిగనున్నారు. రెండు రోజుల పాటు ఈ సమ్మె జరగనుంది. సింగరేణి బొగ్గుగనులను ప్రయివేటీకరణకు నిరసనగా ఈ సమ్మెను చేపపట్టారు. ఈ నెల 28,29 తేదీల్లో సింగరేణి కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ మేరకు ఈరోజు సింగరేణి యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. అన్ని కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొననున్నాయి.

అన్ని సంఘాలు...
సింగరేణి కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. నాలుగు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరించడాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికైనా సింగరేణి గనుల ప్రయివేటీకరణను ప్రభుత్వం ఆపాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.


Tags:    

Similar News