స్టేడియంలో తొక్కిసలాట...129 మంది దుర్మరణం
ఇండోనేషియోలో ఫుట్‌బాల్ మైదానంలో జరిగిన అలర్లలో 120 మంది మరణించారు. 180 మంది తీవ్ర గాయాలయాయి
ఇండోనేషియోలో ఫుట్‌బాల్ మైదానంలో జరిగిన అలర్లలో 120 మంది మరణించారు. 180 మంది తీవ్ర గాయాలయాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. 34 మంది అక్కడికక్కడే మరణించగా, మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 300 మంది గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. ఈస్ట్‌జావాలో పెర్సెబాయ సురబాయ జట్టు అరెమా జట్టు ఓటమి పాలయింది.
ఇరు జట్ల మధ్య...
సొంత మైదానంలో ఓటమి పాలయ్యారని ఆగ్రహించిన అభిమానులు అల్లర్లకు పాల్పడ్డారు. స్టేడియంలోనే ఘర్షణకు దిగారు. పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఆగలేదు. టియర్ గ్యాస్ ప్రయోగించినా ఫలితం లేదు. లాఠీ ఛార్జి చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఘర్షణల్లో, తొక్కిసలాటలో 129 మంది మరణించారు.