ప్రగతి భవన్ లో శునకంమృతి…. కేసు నమోదు

రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతి భవన్ లో ఓ శునకం జ్వరంతో మృతిచెందింది. అయితే వైద్యుల నిర్లక్షమే కారణమంటూ దీనిపై పోలీసు కేసు నమోదైంది. ప్రగతి భవన్ కు [more]

Update: 2019-09-14 06:08 GMT

రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతి భవన్ లో ఓ శునకం జ్వరంతో మృతిచెందింది. అయితే వైద్యుల నిర్లక్షమే కారణమంటూ దీనిపై పోలీసు కేసు నమోదైంది. ప్రగతి భవన్ కు చెందిన 11 నెలల హస్కీ అనే శునకం ఈ నెల 10వతేదీ రాత్రి వరకు బాగానే ఉంది. ఆ రోజు రాత్రి ఏమి తినలేదు. మరుసటి రోజు ఉదయం పాలు కూడా తాగలేదు. సిబ్బంది రెగ్యులర్ గా వీటిని పరీక్షించే పశువైద్యుడికి సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి హస్కీని పరిశీలించారు. జ్వరంతో తీవ్రంగా బాధపడుతుందని గుర్తించారు. వెంటనే యానిమల్ కేర్ క్లీనిక్ లో చేర్పించారు. శ్వాస అందకపోవడంతో హస్కీ అక్కడే మరణించింది. హస్కీ మరణాన్ని జీర్ణించుకోలేని సిబ్బంది ఈ మరణం పట్ల డాక్టర్ రంజిత్, ఆసుపత్రి నిర్వాహకురాలు లక్ష్మిలు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు 429, 11(4) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Tags:    

Similar News