Breaking : జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నా.. వరద బాధితులకు భారీ ప్యాకేజీ ప్రకటించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-09-17 14:31 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని తెలిపారు. గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వచ్చిన డబ్బులను కూడా ఇతర పనులకు మళ్లించారన్నారు. ఖర్చు పెట్టిన డబ్బును అకౌంట్‌లో చూపలేదని అన్నారు. అకౌంట్లను తారుమారు చేశారన్నారు. అన్ని శాఖల అకౌంట్లలో ఉన్న డబ్బులను గత ప్రభుత్వం ఖాళీ చేసిందన్నారు.

ఇల్లు మునిగిపోయిన....
వరదలతో ప్రజలు నరకయాతన అనుభవించారన్నారు. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు ఇస్తున్నారని చంద్రబాబు అన్నారు. వైసీపీ భూతాన్ని శాశ్వతంగా సమాధి చేయాలని పిలుపు నిచ్చారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని నిధులను దారి మళ్లించారని అన్నారు. తనకు అప్పలు చేయడానికి కూడా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశముందని తెలిపారు. వరద బాధితులకు 179 సచివాలయాల్లో ఏ ఇల్లు అయితే మునిగిపోయాయో వారందరికీ 25వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తున్నామని తెలిపారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవారికి పదివేల రూపాయల ఆర్థికసాయాన్ని అందచేస్తామని తెలిపారు. నష్టపోయిన చిరువ్యాపారులకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. టూ వీలర్స్ కు మూడు వేలు, త్రీవీలర్స్ కు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు. పంటలు కోల్పోయిన రైతులకు కూడా పరిహారాన్ని ప్రకటించారు. హెక్టార్ కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు.


Tags:    

Similar News