Tiruamala : ఇదేమి రష్ బాబోయ్... ఈరోజు కూడా దర్శనం కష్టమేనా?

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బుధవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో దర్శనానికి గంటల తరబడి వేచి చూస్తున్నారు

Update: 2024-09-18 03:06 GMT

tirumala darshan

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బుధవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో దర్శనానికి భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. క్యూ లైన్ లో గంటల తరబడి పిల్లా పాపలతో వేచి చూడాల్సి వస్తుంది. అయితే భక్తులు మాత్రం శ్రీవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. గత నాలుగు రోజుల నుంచి తిరుమలలో భక్తుల ర్దీ ఎక్కువగానే ఉంది. ఈరోజు తిరుమలలో శ్రీవారికి పౌర్ణమి గరుడ సేవ జరగనుంది. రాత్రి ఏడు గంటలకు గరుడ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి మాడ వీధుల్లో దర్శనమివ్వనున్నారు. దీంతో భక్తులు అందుకోసం కూడా తిరుమలకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని అధికారులు చెబుతున్నారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు ఉచితంగా అన్న ప్రసాదాలను, మంచినీటి సరఫరా చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి...
అలాగే వసతి గృహాల వద్ద కూడా భారీగా క్యూ లైన్ లు కనిపిస్తున్నాయి. వసగతి గృహాల కేటాయింపు ఆలస్యం కావడంతో అక్కడే భక్తులు పడిగాపులు కాస్తున్నారు. ఖాళీ అవుతున్న వసతి గృహాలను ఎప్పటికప్పుడు క్రమ పద్ధతిలో అధికారులు, సిబ్బంది భక్తులకు కేటాయింపులు చేస్తున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ బయట కృష్ణతేజ గెస్ట్‌హౌస్ వరకూ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 72,072 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,384 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.16 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. రేపు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశముంది.


Tags:    

Similar News