ఆయన ఆరోగ్యం బాగాలేదు.. మందులు కూడా వేసుకోనివ్వలేదు

ఇటవలే అచ్చెన్నాయుడు సర్జరీ చేయించుకున్నారని, ఆయన ఆరోగ్యం సరిగా లేదని అచ్చెన్నాయుడు భార్య మాధవి తెలిపారు. నలభై మంది అధికారులు గేట్లు దూకి 6.30గంటల ప్రాంతంలో ఇంట్లో [more]

Update: 2020-06-12 04:36 GMT

ఇటవలే అచ్చెన్నాయుడు సర్జరీ చేయించుకున్నారని, ఆయన ఆరోగ్యం సరిగా లేదని అచ్చెన్నాయుడు భార్య మాధవి తెలిపారు. నలభై మంది అధికారులు గేట్లు దూకి 6.30గంటల ప్రాంతంలో ఇంట్లో ప్రవేశించారన్నారు మాధవి. అప్పటికే అచ్చెన్నాయుడు లేచి పత్రికలు చదువుతున్నారన్నారు. తాము అధికారులను ప్రశ్నించేలోగానే ఏమీ సమాధానం చెప్పకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లారని మాధవి తెలిపారు. కనీసం మందులు వేసుకునే సమయం కూడా ఇవ్వలేదన్నారు. తన తండ్రి అరెస్ట్ ను సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరిస్తుంటే పోలీసులు అడ్డుకున్నారన్నారు. పోలీసులు దౌర్జన్యంగా తన తండ్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారని ఆయన కుమారుడు మీడియాకు తెలిపారు. 15 కార్లు, ఒక వ్యాన్ లో అధికారులు వచ్చారన్నారు.

Tags:    

Similar News