అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేసి….?
అచ్చెన్నాయుడిని ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జ్ చేసే అవకాశముంది. ఆయన ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగా ఉందని వైద్యులు [more]
అచ్చెన్నాయుడిని ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జ్ చేసే అవకాశముంది. ఆయన ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగా ఉందని వైద్యులు [more]
అచ్చెన్నాయుడిని ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జ్ చేసే అవకాశముంది. ఆయన ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అచ్చెన్నాయుడిని మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం తీర్పుచెప్పిన సంగతి తెలిసిందే. దీంతో అచ్చెన్నాయుడిని ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తే ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించేఅవకాశముంది. అయితే దీనికి అచ్చెన్నాయుడు తరుపున న్యాయవాదులు అభ్యంతరం చెబుతున్నారు. అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ పై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో హైడ్రామా నెలకొంది.