నేటి నుంచి విమాన సర్వీసులు..ఏపీ సర్కార్ షరతులు

దేశంలో విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దేశీయ విమానాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈమేరకు దేశీయంగా నేటి నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే [more]

Update: 2020-05-25 03:48 GMT

దేశంలో విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దేశీయ విమానాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈమేరకు దేశీయంగా నేటి నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా అధిక కేసులున్న మహారాష్ట్ర విమాన సర్వీసుల పునరుద్ధరణకు అంగకరించలేదు. తమిళనాడు కూడా తక్కువ సంఖ్యలో తమ రాష్ట్రానికి అనుమతి ఇవ్వాలని కోరాయి. ఏపీలో కూడా రేపటి నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. మిగిలిన అన్ని రాష్ట్రాలకు నేడు విమానాలు తిరగనున్నాయి. విమానం ద్వారా వచ్చిన ప్రయాణికులకు ఎయిర్ పోర్ట్ లో పరీక్షలు చేసి పంపనున్నారు. అయితే విమానాల ద్వాారా వచ్చే వారికి ఏపీ ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. విమానాల్లో ప్రయాణించాలంటే ముందు స్పందనకు దరఖాస్తు చేసుకోవాలి. ముంబయి, చెన్నై, గుజరాత్ ల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ కు పంపాలని నిర్ణయించారు. కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్ ఉన్నవారిని క్వారంటైన్కు తరలిస్తారు. ఏపీలో రేపటి నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి.

Tags:    

Similar News