IPL 2025: క్రేజ్ కోసమే కంటిన్యూ అవుతున్నాడు భయ్యా.. లేదంటే గుడ్ బై

చెన్నై సూపర్ కింగ్స్ అంటే చాలు ఠక్కున థోని గుర్తుకు వస్తాడు. కేవలం ఐపీఎల్ మ్యాచ్ లలో మాత్రమే ధోనిని చూడగలుగుతాం.;

Update: 2025-04-05 08:31 GMT
ms dhoni, chennai super kings, IPL matches, fans
  • whatsapp icon

చెన్నై సూపర్ కింగ్స్ అంటే చాలు ఠక్కున థోని గుర్తుకు వస్తాడు. కేవలం ఐపీఎల్ మ్యాచ్ లలో మాత్రమే ధోనిని చూడగలుగుతాం. అన్ని ఫార్మాట్లలో రిటైర్ మెంట్ తీసుకున్న ధోని ఐపీఎల్ కు వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్స్ లో ఆటగాడిగా కొనసాగుతున్నారు. టీం మేనేజ్ మెంట్ రిక్వెస్ట్ మేరకు ధోని కొనసాగుతున్నాడు. ధోనీకి ఐపీఎల్ లో కూడా ఆడాల్సిన అవసరం లేదు. అంత ఆసక్తి లేదు. అయినా సరే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, టీం మేనేజ్ మెంట్ కోసమే ధోని ఐపీఎల్ లో ఆడుతున్నాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఛాంపియన్ గా నిలిపి...
అయితే తొలినాళ్లలో చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన ధోని తర్వాత క్రమంగా నాయకత్వ బాధ్యతలను కూడా వేరే వారికి అప్పగించి తాను సాధారణ క్రికెటర్ గా ఉండిపోయారు. అయినా సరే ధోని బ్యాటింగ్ దిగాడంటే చాలు స్టేడియం మొత్తం ఒక ఊగిపోవాల్సిందే. డీజే సౌండ్ కూడా ఫ్యాన్స్ నినాదాల ముందు దిగదుడుపేనంటారు. ఎందుకంటే ఆ సౌండ్ కు కామెంట్రీ కూడా వినపడనంతగా నినాదాలు ఉంటాయి. ధోనికి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదనడానికి మైదానంలో ఫ్యాన్స్ పూనకాలే నిదర్శనం. అనేక సార్లు ఛాంపియన్ గా నిలిపాడు.
వరస ఓటములు చవి చూస్తున్నా...
అయితే ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరసగా ఓటములను చవి చూస్తుంది. ధోని చివరలో బ్యాటింగ్ కు దిగుతున్నాడు. దీనిపై కొందరు విమర్శలు చేస్తున్నా వాటిని పట్టించుకోడు మిస్టర్ కూల్. ఎందుకంటే ముందు వచ్చిన వాళ్లంతా తనకంటే చిన్న వయసు. క్రికెట్ లో దూకుడు గా ఆడేవారే. మంచి ఫామ్ లో ఉన్నవారు. అలాంటి వారిని కాదని తాను రెండు, మూడు డౌన్ లలో వచ్చి ఆడేందుకు ధోనీయే ఒప్పుకోడు. పిచ్ ని బట్టి, స్కోరును బట్టి ఎనిమిది లేక తొమ్మిదో స్థానంలో ధోని వస్తున్నాడు. అయితే వచ్చిన వెంటనే సిక్సర్లు, ఫోర్లు బాదుతుండటంతో ఎక్కువ మంది ధోని ముందు రావాలని కోరుకుంటున్నారు.
తన కంటే ముందు వచ్చిన వాళ్లు...
తన కంటే ముందు వచ్చిన కుర్రోళ్లు బాగా ఆడాలని కోరుకుంటున్నాడన్న విషయాన్ని ధోని ఫ్యాన్స్ మాత్రం మర్చిపోతున్నారు. ధోనీకి ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే ఆయనను టీం లో ఇంకా కంటిన్యూ చేస్తుంది మేనేజ్ మెంట్. అలాంటి పరిస్థితుల్లో ముందు రావడం కంటే ఎప్పుడు వచ్చినా పరవాలేదని టీం మేనేజ్ మెంట్ భావిస్తుంది. అదే సమయంలో ఏ డౌన్ లో రావాలన్నది ధోని ఇష్టం కాదు. చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్ మెంట్, కోచ్, కెప్టెన్ ఇష్టం. నిజానికి ధోని మూడు, లేదా ఫోర్త్ డౌన్ లో వచ్చి విఫలమయితే తిట్టేవాళ్లు కోకొల్లలు. అందుకే మిస్టర్ కూల్ పట్టించుకోడు. ఈరోజు జరిగే మ్యాచ్ లోనూ అంతే. ధోని కోసమే ఇప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ కు సపోర్టర్స్ గా ఉన్నారన్నది కాదనలేని వాస్తవం. ఇటీవల ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో మెరుపువేగంతో ధోని చేసిన స్టంపింగ్ అవుట్ చూసిన వాళ్లకు ఇంకా మహేంద్రుడిలో చేవ తగ్గలేదన్న విషయం అర్థమయి ఉంటుంది.


Tags:    

Similar News