IPL 2025 : ఇంకా కోలుకోని ముంబయి... కలసి రానట్లుంది.. లక్నోదే విజయం
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ ఉత్కంఠత మధ్య ఓటమి పాలయింది;

ఐపీఎల్ 18వ సీజన్ మాత్రం ముంబయి జట్టుకు అస్సలు కలిసి వచ్చినట్లు కనిపించడం లేదు. మంచి బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్లున్నప్పటికీ తక్కువ స్కోరుకే తేలిపోతున్నారు. గత సీజన్ లోనూ అంతే. ఈ సీజన్ లో అయినా కోలుకుంటుందని ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ ఆశించారు. కానీ ఎందుకో ఏమో..ముంబయి ఇండియన్స్ జట్టు సీజన్ ప్రారంభమయి ఇన్ని రోజులయినా కోలుకోలేని పరిస్థితి. ఇక తేరుకుంటుందని కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఓటముల మీద ఓటములను చవి చూస్తుంది. గత మ్యాచ్ లో పుంజుకుందని భావించినప్పటికీ మళ్లీ కథ మొదటికొచ్చింది. అన్ని విభాగాల్లో ఏ మాత్రం ఆటగాళ్లు రాణించలేకపోతుండటంతో ముంబయి జట్టుకు వరస వైఫల్యాలు స్వాగతం పలుకుతున్నట్లే ఉంది.
చివర వరకూ పోరాడినా...
నిన్న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ ఉత్కంఠత మధ్య ఓటమి పాలయింది. లక్నో బ్యాటర్లు కట్టడి చేసేందుకు ప్రయత్నించినా ఎవరో ఒకరిద్దరు క్లిక్ అవుతుండటంతో వారు వీర బాదుడు బాదేస్తుండటంతో అత్యధిక స్కోరు ఇవ్వాల్సి వచ్చింది. మిచెల్ మార్ష్ ఎప్పటిలాగే ఫామ్ లో ఉండడటంతో అరవై పరుగులు చేసి అవుటయ్యాడు. మార్ క్రమ్ కూడా 53 పరుగులు చేశఆడు. పూరన్, పంత్ విఫలమయినా, ఆయుష్ బదోని ముప్ఫయి, మిల్లర్ 27 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించార. మొత్తం ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు లక్నో సూపర్ జెయింట్స్ 203 పరుగులు చేయగలిగింది. భారీ లక్ష్యమే. అయితే బౌలింగ్ లో ముంబయి కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఐదు వికెట్లు తీశాడు. అశ్వినీకుమార్, విఘ్నేశ్ చెరో వికెట్ తీశారు.
లక్ష్యం పెద్దదయినా...
204 పరుగులు లక్ష్యం ముందుంది. రన్ రేటు పెంచుకుంటూ స్ట్రోక్స్ కొడుతూ అవుట్ కాకుండా తర్వాత వచ్చేవారిపై వత్తిడి తగ్గించాల్సిన ఓపెనర్లు విల్ జాక్స్, కికిల్ టన్ లు తక్కువ పరుగులకే అవుటయ్యారు. ఇక సమర్ ధీర్ మాత్రం 46 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ 67 పరుగులు చేశాడు. తిలక్ వర్మ ఇరవై ఐదు పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ అయి వెనుదిరిగాడు. హార్ధిక్ 28 పరుగుల చేసి నాటౌట్ గా నిలిచినా ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేయగలిగింది. చివర వరకూ మ్యాచ్ ముంబయి వైపు తొంగి చూసినా లక్నో బౌలర్లు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. వికెట్లు తక్కువగా చతీసినా పొదుపుగా రన్స్ ఇచ్చి ముంబయి పరాజయానికి లక్నో బౌలర్లు కారణమయ్యారు. నాలుగు మ్యాచ్ లు ఆడి కేవలం ఒక మ్యాచ్ లోనే గెలిచి టేబుల్ లో అట్టడుగన నిలిచింది.