ఓవైసీకి భారీ ఊరట.. ఆ కేసులో నిర్ధోషిగా తేల్చిన కోర్టు

ఈ కేసుల్లో 2013లో అరెస్టైన అక్బరుద్దీన్ ఓవైసీ.. ఆ తర్వాత బెయిల్ తీసుకుని బయటికొచ్చారు. అప్పట్నుంచి నాంపల్లి..

Update: 2022-04-13 09:57 GMT

హైదరాబాద్ : మ‌జ్లిస్ కీల‌క నేత‌, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి భారీ ఊరట లభించింది. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయ‌న‌పై న‌మోదైన కేసుల‌ను కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో అక్బరుద్దీన్ ను నిర్థోషిగా ప్రకటించిన కోర్టు.. కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2012 డిసెంబర్ నెలాఖరులో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించిన అక్బరుద్దీన్.. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా కేసులు నమోదయ్యాయి.

ఈ కేసుల్లో 2013లో అరెస్టైన అక్బరుద్దీన్ ఓవైసీ.. ఆ తర్వాత బెయిల్ తీసుకుని బయటికొచ్చారు. అప్పట్నుంచి నాంపల్లి కోర్టులో ఈ కేసుపై విచారణ జరుగుతూనే ఉంది. ఇటీవలే కేసు విచారణను ముగించిన కోర్టు.. ఏప్రిల్ 12న తుదితీర్పు వెల్లడించనున్నట్లు ప్రకటించింది. కానీ.. తీర్పు మరుసటి రోజుకు వాయిదా వేసిన కోర్టు.. బుధవారం తుది తీర్పు వెల్లడించింది. ఓవైసీని నిర్థోషిగా పేర్కొంటూ.. న్యాయమూర్తి పలు సూచనలు చేశారు. విష్య‌త్తులో ఎలాంటి విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు చేయ‌రాద‌ని, ఇలాంటి ప్ర‌సంగాలు దేశ స‌మ‌గ్ర‌త‌కు మంచిది కాద‌ని తేల్చి చెప్పారు. అలాగే ఈ తీర్పును విజయంగా పరిగణించి.. ఎలాంటి సంబరాలు చేసుకోరాదని సూచించింది.


Tags:    

Similar News