అల్ ఖైదా అగ్రనేత అల్ జవహరీ హతం

అల్ ఖైదా అగ్రనేత అల్ జవహరీ మరణించాడు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు

Update: 2022-08-02 02:14 GMT

అల్ ఖైదా అగ్రనేత అల్ జవహరీ మరణించాడు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో జరిగిన డ్రోన్ దాడిలో అల్ జవహరి మరణించాడు. అమెరికా నిర్వహించిన ఈ ఆపరేషన్ విజయవంతమైనట్లు ప్రకటించింది కాబూల్ లోని షేర్పూర్ ప్రాంతంలో ఓ నివాసంపై జరిపిన వైమానిక దాడుల్లో అల్‌జవహరి మరణించాడు. అల్ ఖైదా అగ్రనేత జవహరి మరణించినట్లు అధికార వర్గాలు కూడా ధృవీకరించాయి.

21 ఏళ్లుగా...
మోస్ట్ వాంటెండ్ ప్రపంచ టెర్రరెస్టుల్లో జవహరీ ఒకరు. సెప్టంబరు 11 2001లో అమెరికాలో జరిగిన ఉగ్రదాడుల్లో జవహరి ప్రమేయం ఉంది. ఒసామా బిన్ లాడెన్ తర్వాత అల్ ఖైదా పగ్గాలను అల్ జవహరీ చేపట్టాడు. దాదాపు ఇరవై ఏళ్లుగా జవహరి కోసం అమెరికా దళాలు వెతుకుతున్నాయి. జవహరి పై 25 మిలియన్ డాలర్ల రివార్డు కూడా అమెరికా ప్రకటించింది. జవహరి మరణించడంతో అల్ ఖైదా మరింత బలహీనమవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. యుద్ధరచనలో దిట్ట అయిన జవహరి మరణంతో అల్ ఖైదా సగం బలాన్ని కోల్పోయినట్లింది. అమెరికా శత్రువులు ఎక్కడున్నా పట్టుకుని వెతుకుతామని జో బైడెన్ తెలిపారు


Tags:    

Similar News