వేసిన తలుపులు వేసినట్లే.. మద్యం మాత్రం మాయం
లాక్ డౌన్ లో మద్యం చోరీ కేసులు పెరిగిపోతున్నాయి. మద్యం దొరకక పోవడంతో చివరకు బార్లు, వైన్స్ లలో చోరీకి పాల్పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో బార్ అండ్ [more]
లాక్ డౌన్ లో మద్యం చోరీ కేసులు పెరిగిపోతున్నాయి. మద్యం దొరకక పోవడంతో చివరకు బార్లు, వైన్స్ లలో చోరీకి పాల్పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో బార్ అండ్ [more]
లాక్ డౌన్ లో మద్యం చోరీ కేసులు పెరిగిపోతున్నాయి. మద్యం దొరకక పోవడంతో చివరకు బార్లు, వైన్స్ లలో చోరీకి పాల్పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో బార్ అండ్ రెస్టారెంట్ తోపాటు వైన్స్ కు రక్షణ లేకుండా పోయింది. తలుపులు పగలగొట్టి మద్యాన్ని ఎత్తుకుపోతున్న మందుబాబుల ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు 40 పైగా మద్యం చోరి కేసులు జరిగాయి. తార్నాక గుడ్ ల్యాండ్స్ బార్ & రెస్టారెంట్ లో మద్యం సీసాల దొంగతనం జరిగింది. 170 ఫుల్ బాటిల్ మద్యాన్ని దొంగలు ఎత్తుకు పోయారు.
గుడ్ ల్యాండ్ బార్ లో…..
తార్నాక చౌరస్తా లో ఉన్న గుడ్ ల్యాండ్స్ బార్ పై పెంట్ హౌస్ తలుపు గొళ్ళెం విరగ్గొట్టి, లోనికి ప్రవేశించిన గుర్తు తెలియని దొంగలు వివిధ బ్రాండ్ లకు సంబందించిన 170 మద్యం ఫుల్ బాటిల్స్ ను దొంగిలించారు. సీసీ టీవీ కెమెరాల కు కనపడకుండా ఒక టవల్ కప్పివేశారు. బార్ మిద్దె పై గల మొక్కలకు నీళ్ళు పెట్టడానికి యజమాని వచ్చినప్పుడు ఈ విషయాన్ని గమనించి అనుమానంతో షట్టర్లు తెరిచి బార్‌లోకి ప్రవేశించినప్పుడు మద్యం గది తాళం విరగకొట్టి తలుపు తెరిచి ఉంది. దీంతో బార్ యజమాని వీర కుమార్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ లో కంప్లయింట్ చేశారు. , ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.